KCR | హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం, ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు వారికి మరింత శక్తినివ్వాలని కోరుకున్నారు.