KCR | హైదరాబాద్ : సుప్రసిద్ధ కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు, అంబేద్కరిస్ట్ డా విజయభారతి మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్ కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సాహిత్య, సామాజిక అధ్యయనశీలిగా విశ్లేషకులుగా విజయభారతి చేసిన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు.
తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్‌గా సేవలందించిన విజయ భారతి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాల సంపుటాలకు సంపాదకురాలుగా, మహాత్మా జోతిరావు పూలే జీవిత చరిత్రను తెలుగు సమాజానికి మొట్టమొదటి సారి అందించిన రచయిత్రిగా వారి కృషి అమోఘమన్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కాగా విజయ భారతి ప్రముఖ కవి, రచయిత, పద్మభూషణ్ దివంగత డాక్టర్ బోయి భీమన్న పెద్ద కుమార్తె. న్యాయవాది, మానవ హక్కుల నేత అమరుడు బొజ్జా తారకం సహచరి. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మాతృమూర్తి.
ఇవి కూడా చదవండి..
Viajaya Bharathi | ప్రముఖ రచయిత్రి బి విజయభారతి కన్నుమూత
Harish Rao | మూసీలో రక్తం పారించాలనుకుంటున్నావా..? రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్
TG Weather | తెలంగాణలో మరో రెండురోజులు వానలు