Sri Rama Navami | ఆదర్శపాలకుడు రామచంద్రుడు.. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
Sri Rama Navami | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
Sri Rama Navami | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడు అవతరించిన రోజు, సీతారాముల కల్యాణ మహోత్సవం జరిగిన రోజే శ్రీరామనవమి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యపాలన చేసిన శ్రీరాముడు ఆదర్శ పరిపాలకుడని కేసీఆర్ అన్నారు. అన్యోన్య దాంపత్యానికి సీతారాములు ఆదర్శనీయులని కేసీఆర్ తెలిపారు. సీతారాముల కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా వెలుగొందేలా, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని భద్రాద్రి సీతారామచంద్రులను కేసీఆర్ ప్రార్థించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

