హ్యుందాయ్ సరికొత్త ఎస్యూవీ
హ్యుందాయ్ మోటర్.. దేశీయ మిడ్‌సైజ్ ఎస్యూవీ విభాగంలో పోటీని మరింత తీవ్రతరం చేసే ఉద్దేశంలో భాగంగా మరో మాడల్‌ను పరిచయం చేసింది. బెయాన్ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా నిర్ణయించింది.
- రూ.9.99 లక్షల విలువైన బెయాన్ను విడుదల చేసిన సంస్థ
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: హ్యుందాయ్ మోటర్.. దేశీయ మిడ్‌సైజ్ ఎస్యూవీ విభాగంలో పోటీని మరింత తీవ్రతరం చేసే ఉద్దేశంలో భాగంగా మరో మాడల్‌ను పరిచయం చేసింది. బెయాన్ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా నిర్ణయించింది. దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తొలిసారిగా ఏఐ వాయిస్ అసి ఫ్యూచర్ టెక్నాలజీ, జనరేటివ్ ఏఐ, 70కి పైగా అడ్వాన్స్ భద్రత ఫీచర్లు, 1.5 లీటర్ ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్, ఆరు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ వైర్లెస్ చార్జర్, సీ-టైప్ యూఎస్బీ చార్జింగ్ పోర్ట్స్ వంటి ఫీచర్లతో తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. దేశీయ వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా, భవిష్యత్తు మొబలిటీ పరిష్కారాలను అందించేదిగా దీన్ని పేర్కొన్నారు. దేశీయంగా తయారైన ఈ మాడల్‌ను 50 దేశాలకు ఎగుమతి చేయనున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

