ఎండుతున్న పంటలు.. తల్లడిల్లుతున్న రైతన్న
విద్యుత్తు కోతల కారణంగా నీళ్లందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టినా నీళ్లు లేక పంటలు కండ్ల ముందే ఎండిపోవడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. చేసేదేమీ లేక కొందరు రైతులు ఎండిన పంటలను తగుల బెడుతుండగా, మరికొందరు పశువులను మేపుతున్నారు. సర్కార్ నిర్లక్ష్యం తమ కొంప ముంచిందంటూ రైతులు వాపోతున్నారు.
విద్యుత్తు కోతల కారణంగా నీళ్లందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టినా నీళ్లు లేక పంటలు కండ్ల ముందే ఎండిపోవడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. చేసేదేమీ లేక కొందరు రైతులు ఎండిన పంటలను తగుల బెడుతుండగా, మరికొందరు పశువులను మేపుతున్నారు. సర్కార్ నిర్లక్ష్యం తమ కొంప ముంచిందంటూ రైతులు వాపోతున్నారు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం లక్ష్మతండాలో రైతు జాటోత్ రైలు మూడు ఎకరాల్లో పత్తి వేశాడు. రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. మొదట్లో ఎండలు ఎక్కువగా ఉండటంతో పత్తి విత్తనం మూడుసార్లు నాటాడు. తర్వాత వానలు లేకపోవడంతో పంట ఎర్రబారింది. వచ్చిన ఒకటి,రెండు కాయలు కూలోళ్లతో ఏరిస్తే రూ.20వేల ఖర్చయ్యింది. పెట్టుబడి కూడా రాకపోవడంతో చేసేదేమీ లేక చేనులో గొర్రెలు మేపాడు.
– నర్సింహులపేట
కడుపు మండి.. ఎండిన పంటకు నిప్పు

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రానికి చెందిన రైతు యాతాకుల మల్లయ్య నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. కరెంట్ సమయానికి రాక పొలానికి నీరందక చేతికి రావాల్సిన పంట ఎండిపోయింది. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. సీజన్‌కు రూ.20వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.40 వేలు కట్టాలి. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో కడుపు మండి.. ఎండిన పంటను తగులబెట్టాడు రైతు మల్లయ్య. కుటుంబం ఎలా గడుస్తదోనని కన్నీరుపెట్టుకున్నాడు.
– ఆత్మకూర్.ఎస్
జనరేటర్ సాయంతో పంటకు నీళ్లు..

రైతన్నలను కరెంట్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. విద్యుత్తు కోతలు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎండుముఖం పట్టిన పంటలను కాపాడుకోవడానికి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడకు చెందిన రైతు చీరాల రాజశేఖర్‌రెడ్డి తనకు ఉన్న ఆరెకరాల్లో వరి సాగుచేశాడు. బోరు నీటి ఆధారంగా సాగు చేసిన పంటకు విద్యుత్తు కోతల కారణంగా సక్రమంగా నీళ్లు అందక రెండెకరాలు ఎండిపోయింది. మిగిలిన పంటను ఎలాగైనా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో రూ.లక్ష వెచ్చించి జనరేటర్ తెచ్చి ట్రాక్టర్‌కు బిగించాడు. కరెంట్ లేని సమయంలో జనరేటర్ ఆన్ చేసి పొలానికి నీళ్లు పారబెడుతున్నాడు.
– ధన్వాడ
నీళ్లులేక.. కళతప్పిన చెక్‌డ్యామ్

ఇది మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం గౌరిదేవునిపల్లి శివారులో పెద్దవాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్. ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతున్నది. బీఆర్ఎస్ హయాంలో దేవరకద్ర ఎమ్మెల్యేగా ఉన్న ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నియోజకవర్గంలోని పలు వాగులపై అత్యధికంగా చెక్‌డ్యామ్‌లు కట్టించారు. దీంతో ఏడాది పొడవునా జలకళను సంతరించుకున్న చెక్‌డ్యామ్‌లు నేడు కళతప్పాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా.. ఎంజీకేఎల్ఐ కృష్ణా జలాలను ఎత్తిపోయడంలో పాలకుల వైఫల్యం రైతులకు శాపంగా మారింది. ఓ వైపు సాగునీటి కొరత.. మరో వైపు కరెంట్ కోతలతో అన్నదాతలు దిగాలు చెందుతున్నారు.
– మూసాపేట(అడ్డాకుల)
ట్యాంకర్ నీటితో తడులు

రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో రైతు గోరేటి వెంకటేశ్‌యాదవ్ రెండు ఎకరాల్లో వరి సాగుచేశాడు. అప్రకటిత కరెంట్ కోతలతో సరిపడా నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయి. పంటను కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకర్‌తో నీళ్లు అందిస్తున్నాడు. ఇప్పటివరకు 15 ట్యాంకర్లతో మడులు తడిపినట్టు రైతు వెంకటేశ్ యాదవ్ పేర్కొన్నాడు. నిరంతరాయంగా కరెంట్ సరఫరా
చేస్తే ఈ బాధలు ఉండేవికావని వాపోయాడు.
– కడ్తాల్
కండ్లముందే పంట ఎండిపాయె..

యాదయ్య అనే ఈ రైతు మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం గౌరిదేవునిపల్లి శివారులో పెద్దవాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్ కింద పది ఎకరాల్లో వరి సాగు చేశాడు. చెక్‌డ్యామ్‌లో నీరు లేకపోవడం.. కరెంట్ కోతల కారణంగా నీటి తడులు అందించలేని పరిస్థితి నెలకొన్నదని, ఫలితంగా పంట ఎండిపోయిందని విచారం వ్యక్తంచేశాడు.
– మూసాపేట(అడ్డాకుల)
ఎండిన పొలంలో రైతుల నిరసన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మహ్మద్‌నగర్‌కు చెందిన పలువురు రైతులు సీతాయిగూడెంలోని వెంగళరావు ప్రాజెక్టు కుడి కాలువ కింద 200 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ ఏడాది అలుగు మరమ్మతుల పేరుతో అధికారులు కనీసం నీటి చుక్క కూడా వదలలేదు. నీరందక ఎండిపోయిన వరి పొలంలో రైతులు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేతికొచ్చిన పంటలు నీరందక ఎండిపోతున్నాయని, దీనికి ప్రభుత్వ, నీటిపారుదల శాఖ అధికారుల వైఫల్యమే కారణమని ఆరోపించారు.
– చండ్రుగొండ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

