పడిక్కల్ 199.. భారత్-ఏ 488/8
టీమిండియా యువ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ (248 బంతుల్లో 24 ఫోర్లు, 3 సిక్స్‌లతో 199) వీరోచిత పోరాటంతో న్యూజిలాండ్-ఏతో అనధికారిక తొలి టెస్టులో భారత్-ఏకు ఆధిక్యం దక్కింది. ద్విశతకానికి ఒక్క పరుగు దూరంలో ఉండగా అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో పడిక్కల్ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
- వివాదాస్పద నిర్ణయంతో దేవ్‌దత్ చేజారిన డబుల్ సెంచరీ
లింకన్ : టీమిండియా యువ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ (248 బంతుల్లో 24 ఫోర్లు, 3 సిక్స్‌లతో 199) వీరోచిత పోరాటంతో న్యూజిలాండ్-ఏతో అనధికారిక తొలి టెస్టులో భారత్-ఏకు ఆధిక్యం దక్కింది. ద్విశతకానికి ఒక్క పరుగు దూరంలో ఉండగా అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో పడిక్కల్ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఓవర్‌నైట్ స్కోరు 106/2తో మూడో రోజు, సోమవారం క్రీజులోకి వచ్చిన భారత్.. ఆట ముగిసే సమయానికి 488/8 పరుగుల భారీ స్కోరు చేసింది.
89 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట ఆరంభించిన పడిక్కల్.. సాయి సుదర్శన్ (91), యశ్ రాథోడ్ (66)తో కలిసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. వాషింగ్టన్ సుందర్ (51 బ్యాటింగ్)తో పాటు ఆకాశ్ దీప్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. లోయరార్డర్లో ఆకిబ్ నబీ (38), అన్షుల్ కాంబోజ్ (23)తో కలిసి వాషింగ్టన్ భారత జట్టును 284 పరుగుల ఆధిక్యంలో నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

