KCR : పాతబస్తీ (Old city) లోని చార్మినార్ (Charminar) సమీపంలోగల గుల్జార్ హౌస్ (Guljar house) లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం (Fire accident) పై బీఆర్ఎస్ అధినేత (BRS chief) కేసీఆర్ (KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఏకంగా 17 మంది మృత్యువాత పడడం విచారకరమని పేర్కొన్నారు. ఆ మరణాలపట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు.
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తగిన ఆర్థికసాయం ప్రకటించి అండగా నిలవాలని ప్రభుత్వానికి సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నిత్యం అప్రమత్తంగా ఉంటూ తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.