KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేవరకొండ పర్యటన రద్దయ్యింది. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ తండ్రి రమావత్ కనీలాల్ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించడంతో పాటు.. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆదివారం నాడు దేవరకొండ వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కేసీఆర్ పర్యటనకు ఆ జిల్లా కలెక్టర్ అనుమతించలేదు. దీంతో కేసీఆర్ తన పర్యటను రద్దు చేసుకున్నారు.