తెలంగాణవాది, సీనియర్ ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డితో తనకున్న ఉద్యమ బంధాన్ని స్మరించుకున్నారు.
మధుసూదన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలక కృషి చేశారని కొనియాడారు. మేధావిగా భావజాల ప్రాప్తి చేస్తూ ఉద్యమ పాఠాలు బోధిస్తూ తెలంగాణ కోసం పాటుపడ్డారని అన్నారు. బహుజన పక్షపతిగా మధుసూదన్ రెడ్డి ఆలోచనాధార గొప్పదని అన్నారు. మధుసూదన్ రెడ్డి కుటుంబసభ్యులు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.