KCR | తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు కోలా జనార్దన్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కోలా జనార్దన్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.