నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు తీర్పు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సంబురాలు మిన్నంటాయి. సిద్దిపేట జిల్లా తొగుట మం డలం చందాపూర్ వద్ద కూడవెల్లి వాగులో కాళేశ్వర జలాలతో కేసీఆర్ చిత్రపటానికి తొగుట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం, జలాభిషేకం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ముక్రా(కే)లోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ చిత్రపటానికి రైతులు జలాభిషేకం చేశారు.
కరీంనగర్లో సంబురాల్లో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సంబురాలు జరుపుకొన్నారు. హనుమకొండ చౌర స్తా సెంటర్లో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ క్షీరాభిషేకం చేసి మిఠాయిలు పంచారు. ఖమ్మం నగరంలో సంబురాల్లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎండీ కమర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు.
తెలంగాణభవన్‌లో సంబురాలు
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు వెలువరించిన తీర్పు పట్ల హర్షం వ్యక్తంచేస్తూ బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో బుధవారం సంబురాలు జరిగాయి. ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పార్టీ నాయకులు పుష్పగుచ్ఛం అందజేసి మిఠాయి తినిపించారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కాలేరు వెంకటేశ్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, చిరుమళ్ల రాకేశ్, వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, నేతలు కిశోర్‌గౌడ్, తుంగబాలు, బోయిండ్ల విద్యాసాగర్, కురవ విజయ్‌కుమార్, సుమిత్రా ఆనంద్, రాఘవ, లీగల్‌సెల్ సభ్యులు కల్యాణ్‌రావు, లలితారెడ్డి తదితరులకు మిఠాయిలు పంచుకున్నారు.