అమరుల త్యాగాలను యాది చేస్తూ.. ఉద్యమ ఘట్టాలను స్మరిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీకి జనం వెల్లువలా తరలివచ్చారు. జై తెలంగాణ.. జైజై తెలంగాణ.. అమరవీరులకు జోహార్ అన్న నినాదాలు ఆ ప్రాంగణమంతా మార్మోగాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుమేరకు తరలివచ్చిన జనసందోహం ఆయనతో కలిసి అమరులకు ప్రణమిల్లింది. వేనవేల నివాళ్లు అర్పించింది. మరోవైపు ర్యాలీని అడ్డుకునేందుకు అధికార కాంగ్రెస్ అడుగడుగునా ప్రయత్నించింది. దశాబ్ది ఉత్సవాల వేళ గన్‌పార్క్ చుట్టూ ఇనుప కంచెలను వేసి కుటిలబుద్ధిని చాటుకున్నది.
Telangana | హైదరాబాద్, జూన్1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్‌పార్క్ నుంచి సెక్రటేరియట్ అమరజ్యోతి వరకూ శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గన్‌పార్క్ వద్దకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలతో కలిసి వచ్చారు. అమరవీరులకు నివాళులర్పించారు. కొవ్వొత్తుల ర్యాలీని ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి గులాబీ శ్రే ణులు, పార్టీ ముఖ్య నేతలు, భారీగా తరలివచ్చిన తెలంగాణవాదులు కొవ్వొత్తులతో ర్యాలీ గా బయలుదేరారు. ర్యాలీకి ముందు కళాకారులు ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు తదితర నేతలు నినదిస్తూ గులాబీ దండుతో కలిసి గన్‌పార్క్, రవీంద్రభారతి మీదుగా సెక్రటేరియట్ వైపు సాగారు. వేలాదిగా తరలివచ్చిన తెలంగాణవాదులు, ఉద్యమకారులు, న్యాయవాదులు, విద్యార్థులు, మహిళలు, కళాకారు లు, కేసీఆర్ అభిమానులతో రవీంద్రభారతి, అసెంబ్లీ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ప్రతి ఒక్కరిలో ఉద్యమం నాటి స్ఫూర్తి మరోసారి తొణికిసలాడింది. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. సంస్కృతీసంప్రదాయాలు ఉట్టి పడే లా కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ‘జోహారులు.. జోహారులు.. అమరులకు జోహార్’ అంటూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీ నివాస్ పాడిన పాట ప్రతీనోటా ప్రతిధ్వనించింది.
గన్‌పార్క్ వద్ద క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ఎంపీ సంతోష్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, మధుసూదనాచారి, దండె విఠల్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, నేతలు నామా నాగేశ్వర్ రావు, రాజయ్య, మాలోత్ కవిత, రవీందర్ సింగ్, బాజిరెడ్డి గోవర్ధన్
కేసీఆర్ గన్‌పార్క్ వద్దకు చేరుకోగానే గులా బీ నేతలు, తెలంగాణవాదులు పెద్ద పెట్టున ని నదించారు. తీవ్ర భావోద్వాగానికి గురయ్యా రు. తమ అధినేత, అభిమాన నాయకుడిని త మ ఫోన్లో బంధించడానికి పోటీపడ్డారు. కేటీఆర్, హరీశ్‌రావుతోనూ సెల్ఫీలు దిగారు.
క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, ఎన్నారై నేత అనిల్ కుర్మాచలం
అధికారంలోకి రాగానే కంచెలు తొలగిస్తాం అని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో అందుకు భిన్నంగా ముందుకు సాగుతున్నది. గన్‌పార్క్ చుట్టూ ఇనుప కంచెలను బిగించింది. బీఆర్ఎస్ నేతలు నివాళ లర్పించిన అనంతరం వాటిని తొలగించింది.
గన్‌పార్క్ వద్ద క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నేతలు రాగిడి లక్ష్మారెడ్డి
కొవ్వొత్తుల ర్యాలీకి పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. ప్రభుత్వ ఆదేశాలతో అతిగా ప్రవర్తించినట్టు తెలుస్తున్నది. గ న్పార్క్, రవీంద్రభారతి వద్ద అడ్డుకునే య త్నం చేశారు. అమరజ్యోతి వద్ద బీఆర్ఎస్ నా యకులు ఏర్పాటుచేసిన మైక్‌లను పోలీసులతో తీసివేయించి ప్రభుత్వం తన కుటిలబుద్ధిని చాటుకున్నది. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. గులాబీ అధినేత కేసీఆర్ రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయారు. సమాచారం ఇచ్చినా స్పందించలేదంటే పోలీసుల తీరును అర్థం చేసుకోవచ్చు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, దీవకొండ దామోదర్‌రావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, పార్టీ నేతలు బోయినపల్లి వినోద్‌కుమార్, సంతోష్‌కుమార్, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, బండ ప్రకాశ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పొన్నాల లక్ష్మయ్య, పార్టీ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ, బం డారు లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, వాణీదేవి, గోర టి వెంకన్న, తాతా మధు, సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ నేతలు రసమయి బాలకిషన్, బాల్క సుమన్, కర్నె ప్రభాకర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు పాల్గొన్నారు.
క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీలు దామోదర్ రావు, సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, జైపాల్ యాదవ్, బండారి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఉన్న అమరవీరుల స్థూపం రంగును మార్చి కాంగ్రెస్ ప్ర భుత్వం కుటిలబుద్ధిని చాటుకున్నది. గతంలో గులాబీ రంగు ఉండగా దానిని ముదురు ఎరు పు రంగుతో మార్చివేశారు. కాంగ్రెస్ సర్కారు తన కురుచ బుద్ధిని ప్రదర్శిస్తున్నదని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, రాజయ్య, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కోవ లక్ష్మి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, మధుసూదనాచారి, దండె విఠల్, ఎంపీలు సురేశ్‌రెడ్డి, నేతలు వినోద్ కుమార్, బాజిరెడ్డి గోవర్ధన్, మాలోత్ కవిత, గొంగిడి సునీత
బీఆర్ఎస్ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు
సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ అమరవీరుల త్యాగాలను అవమానిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కొవ్వొత్తుల ర్యాలీకి తరలివచ్చిన పార్టీ శ్రేణులు, తెలంగాణవాదులను ఉద్దేశించి అమరజ్యోతి వద్ద ఆయన ప్రసంగించారు. జీవితంలో ఒకసారి కూడా జై తెలంగాణ అనని వ్యక్తి, ఒకనాడూ అమరవీరుల స్థూపానికి నమసరించని వ్యక్తి సీఎం అయ్యాడని, అది మన దురదృష్టమని విమర్శించారు. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని గుర్తుచేశారు. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ చరిత్రని, పౌరుషాన్ని, అస్తిత్వాన్ని అవమానపరిచే విధంగా ఈ ప్రభుత్వం, సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరవీరుల త్యాగాలను అవమాన పరుస్తున్నార ని, వారిని చంపిందే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు.