హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం రాధారపు సతీశ్‌కుమార్ అధ్యక్షతన బహ్రెయిన్‌లోని అండాలస్ గార్డెన్లో కార్యవర్గసభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో పదేండ్లు కరువులేదని, జలాశయాలు నిండుగా ఉన్నాయని గుర్తుచేశారు. కాంగ్రెస్‌పాలనలో నాలుగు నెలలకే కరువును చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు తెస్తామంటే నమ్మి అధికారం అప్పగిస్తే పాలన చేతగాక కాంగ్రెస్ నేతలు చిల్లర మాటలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు రాష్ట్ర సమస్యలపై ఏనాడూ కేంద్రాన్ని నిలదీసిన పాపాన పోలేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ సరార్ ప్రజలను మోసం మోసగించిందని ధ్వజమెత్తారు. సమావేశంలో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి పుప్పాల బద్రి, అన్నారం సుమన్, కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్, బొలిశెట్టి ప్రమోద్, చిలుకూరి రాజలింగం, మరుపాక దేవయ్య, తిప్పారవేణి శ్రీనివాస్, మెరుగు శ్రీనివాస్, కొందరి రాజేందర్, పెనుగొండ శ్రీకాంత్, కోటగిరి శ్రీనివాస్, స్వామి ఉన్నారు.