హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ప్రజలు షాకిచ్చారు. కడియం ఇలాకాలో గులాబీ జెండాను రెపరెపలాడించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి ననుబాల మొగిలి భారీ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 300 ఓట్లతో భారీ విజయం సాధించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కడియం ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు గులాబీ జెండాకే జైకొట్టారని, కేసీఆర్‌ను చూసి తనకు ఓట్లేసి గెలిపించారని మొగిలి పేర్కొన్నారు. కేసీఆర్‌పై కొండంత విశ్వాసంతో గెలిపించిన ప్రజలకు మొగిలి కృతజ్ఞతలు తెలిపారు.
దోసపల్లిలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం
రేగోడ్, డిసెంబర్ 14: మెదక్ జిల్లా రేగోడ్ మండలం దోసపల్లిలో వరుసగా మూడుసార్లు సర్పంచ్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకున్నది. 2014లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారు మంగళి లక్ష్మి 17 ఓట్లతో, 2019 లో పట్లోళ్ల విజయలక్ష్మి గురునాథ్‌రెడ్డి 67 ఓట్లతో, తాజాగా ఆదివారం జరిగిన ఎన్నికల్లో అమరసింహారెడ్డి 60 ఓట్ల ఆధిక్యంతో సర్పంచ్‌గా గెలుపొందారు.