TS Assembly Elections | ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి ముందంజలో ఉన్నారు. 14వ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మికి 4,246 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ నాయక్‌కు 3717 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి విజయ్‌కుమార్‌కు 203 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి 20,669 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.