పెబ్బేరు మండల బీఆర్ఎస్ నాయకుడు పాతపల్లి గోవిందు గురువారం ఏపీలోని తిరుమలలో బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశాన్ని అక్కడి భక్తులకు వివరించారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి మంత్రి నిరంజన్‌రెడ్డి రూపొందించిన క్యాలెండర్లను ఆయన పంపిణీ చేశారు. ఏపీతోపాటు దేశంలో బీఆర్ఎస్ విస్తరించాలని ఏడుకొండల వెంకన్నను మొక్కుకున్నట్టు ఆయన తెలిపారు.
– పెబ్బేరు