అలంపూర్, జూలై 6 : ‘సర్’పై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ సూచించారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ‘సర్’ కా ర్యక్రమ నిర్వహణలో బీఎల్ఏల బాధ్యత, ఓటరు ప్రక్రియ.. ముసాయిదా జాబితా.. అభ్యంతరాలు.. తదితర అంశాలపై ఆయన వివరించారు.
సర్ ప్రోగ్రామ్లో డూప్లికేట్, మృతి చెందిన ఓటర్లను తొలగించుకోకపోతే రానున్న ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలకు సర్ ప్రోగ్రామ్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కల్పించిందని చెప్పారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై శ్రేణులు దృష్టి సారించాలని తెలిపారు. ఈసారి డిజిటల్ సభ్యత్వ నమోదు ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ.. నడిగడ్డలో బీఆర్ఎస్కు ఆదరణ ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. ‘సర్’ కార్యక్రమంపై పార్టీ శ్రేణు లు అప్రమత్తంగా ఉండి.. అర్హుల పేర్లు పోకుండా చూడాలని సూచించారు.