బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం రూపొందించిన ‘తెలంగాణలో కాంగ్రెస్ పాపాల శతకం’, ‘సాంగ్రెస్’ పుస్తకాలను మంగళవారం తెలంగాణ భవన్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కవులు శతకపద్యాలు రాసినట్టు, చిత్రగుప్తుడు మానవుల పాపాల చిట్టా రాసినట్టు కాంగ్రెస్ పాపాల గురించి శతకాలు, గ్రంథాలు రాయాల్సి వస్తున్నదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు వై సతీశ్‌రెడ్డి, జగన్మోహన్రావు, దినేశ్ దరి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.