హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డిని పలువురు ప్రజాప్రతినిధులు ఆదివారం కలిశారు. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం కుటుంబసమేతంగా సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి సైతం సీఎంను కలిశారు. వారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సీఎం నివాసానికి వెళ్లారు. బీజేపీ నేత బంగారు శృతి సీఎంను ఆయన నివాసంలో కలిశారు. ఆమె నాగర్‌కర్నూల్ నుంచి బీజేపీ టిక్కెట్ ఆశించి, భంగపడిన నేపథ్యంలో సీఎంను కలవడం ప్రాధాన్యం సంతరించుకున్నది.