హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు బుధవారం బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. అనుమతులేవీ లేకుండానే ఏపీ ప్రభుత్వం బనకచర్లను నిర్మిస్తున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేఆర్ సురేశ్‌రెడ్డి ఆరోపించారు. గోదావరి నీళ్లను అక్రమంగా వినియోగించుకుంటూ తెలంగాణ నీటి హకులకు నష్టం కలిగిస్తున్నందున 267 పద్దు కింద సురేశ్‌రెడ్డి వాయిదా తీర్మానం నోటీ సు ఇచ్చారు. అత్యవసర అంశం అయినందున బుధవారం నాటి సభా కార్యకలాపాలన్నింటినీ రద్దు చేసి బనకచర్ల అంశంపై చర్చించాలని ఆయన కోరారు. అయితే, ఈ తీర్మానాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్‌సింగ్ తోసిపుచ్చి, చర్చకు నిరాకరించారు.