మోటకొండూర్, జూన్ 9: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండల కేంద్రానికి సోమవారం వచ్చిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు నిరసన సెగ తగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువవికాస్, ఇందిరమ్మ ఇండ్లు ఆ పార్టీ కార్యకర్తలకే వస్తున్నాయని మోటకొండూర్ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు.
ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని నిలదీశారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో పోలీసులు కలగజేసుకొని సర్దిచెప్పారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వంగా చరిత్రలో కాంగ్రెస్ నిలిచిపోతుందని బీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి ఎగ్గిడి కృష్ణ పేర్కొన్నారు.