మూసాపేట(అడ్డాకుల), అక్టోబర్ 11 : తల్లి సంవత్సరికానికి వచ్చి ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. ఈ ఘటన మహబూబ్‌నగ ర్ జిల్లా అడ్డాకుల మండలం బలీదుపల్లిలో చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీనివాసులు వివరాల ప్రకారం.. బలీదుపల్లికి చెందిన మంద యాదయ్య, మణెమ్మ దంపతులకు నలుగు రు కుమారులు. హైదరాబాద్‌లో ఆటోలు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. నిరు డు మణెమ్మ మృతిచెందింది.
తల్లి ప్రథమ వర్ధంతి సందర్భంగా గురువారం నలుగురు గ్రామానికి వచ్చారు. శనివారం పూజ చేసిన పూలు, సామగ్రిని సమీపంలోని చెక్‌డ్యాం నీటిలో కలిపేందుకు వెళ్లారు. ప్రమాదవశా త్తు నలుగురిలో పెద్ద కుమారుడు సుధాక ర్(33) కాలుజారి చెక్‌డ్యాంలో పడిపోయా డు. వరదలో కొట్టుకుపోతుండగా తమ్ముడు సాయి (22) అన్న ను కాపాడేందుకు చెక్‌డ్యాంలోకి దూకాడు.
ఇద్దరూ మునిగిపోతుండగా మిగిలిన వారు అక్కడే ఉన్న అడ్డపంచె సాయంతో బయటకు లాగారు. అప్పటికే మంద సుధాకర్ అపస్మారక స్థితికి చేరుకోగా, మంద సాయి శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు. అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానకు తరలించగా వారు అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.