యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ గురువారం దర్శించుకున్నారు. మొదటగా స్వయంభూ పంచనారసింహ స్వామికి పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం చేశారు. లక్ష్మీనరసింహస్వామి దర్శనం అద్భుతంగా జరిగిందని గారెత్ విన్ ఓవెన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అనంతరం ఆయన యాదాద్రి జిల్లా కలెక్టరేట్‌కు చేరుకొని కలెక్టర్ పమేలాసత్పతితో మాట్లాడారు.
-యాదగిరిగుట్ట