 
                                                            మహబూబ్నగర్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ము ఖ్యనేత డ్రైవర్ వేధింపులు భరించలేక ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘట న నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో చోటుచేసుకున్నది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. చంద్రవంచకు చెందిన గొల్ల శ్రీలత(21)కు ఈ నెల 26న (ఆదివారం) వివాహం జరిగింది.
అప్పటికే అమ్మాయిని అదే గ్రామానికి చెందిన శ్రీశైలం అలియాస్ సూరి ప్రేమించాడు. వారిద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో గ్రామపెద్దలు వారికి సర్ది చెప్పి విడగొట్టారు. సదరు యువతి కాంగ్రెస్ నేతకు తన గోడు వినిపించగా సూరి అతడి డ్రైవర్ కావడంతో ఆ యువతినే మందలించాడు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు కూతురికి సర్దిచెప్పి మరో యువకుడితో వివాహం చేశారు.
అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఇ ష్టం లేని సూరి పెళ్లి తర్వాత రెం డో రోజు మంగళవారం ఫోన్ చే సి వేధించడం తో శ్రీలత మనస్తాపానికి గురై పురుగులమందు తాగింది. దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. నవవధువు మృతిపై కుటుంబసభ్యులు, గ్రామస్థులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పురుగులమందు తాగిన ప్రాంతంలోనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
గురువారం రాత్రి వరకు మృతురాలి కు టుంబ సభ్యులు, గ్రామస్థులు నవ వధు వు మృతదేహంతో కోస్గిలో ఆందోళన నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ వచ్చి న్యా యం చేయాలని భీష్మించారు. ఎస్సై బాలరాజును వివరణ కోరగా.. శ్రీలత వివాహమైన మూడు రోజుల తర్వాత దోమ మండలం మోత్కూర్లో పురుగుల మం దు తాగి ఆత్మహత్యాయత్నం చేసిందని, దోమ పోలీస్స్టేషన్ పరిధిలో కేసు నమోదైందని వివరించారు.
 
                            