మెదక్‌రూరల్, జూలై 8: అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్న టిప్పర్‌ను వదిలిపెట్టేందుకు మెదక్ జిల్లా హవేళీఘనాపూర్ ఎస్సై ఆనంద్‌గౌడ్ లంచం డిమాండ్ చేశారు. సోమవారం మధ్యవర్తి నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు.
ఏసీబీ డీఏస్పీ సుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ.. మెదక్ పట్టణానికి చెందిన పూలగంగాధర్ టిప్పర్ ఈ నెల 29న ఇసుకను తరలిస్తూ పట్టుబడింది. దీంతో టిప్పరు వదిలిపెట్టేందుకు ఎస్సై ఆనంద్‌గౌడ్ రూ.50 వేలు డిమాండ్ చేయగా రూ.20 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.
ఈ కేసులో పూలగంగధర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మధ్యవర్తి మస్తాన్ అనే వ్యక్తి హవేళీఘనాపూర్ పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి డబ్బులు తీసుకెళ్లి ఎస్సై ఆనంద్‌గౌడ్‌కు ఇవ్వగా పట్టుకొని విచారణ చేపడుతున్నట్టు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.