ప్రభుత్వ పాఠశాలల్లో మళ్లీ బ్రేక్‌ఫాస్ట్
కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని నిలిపివేసిన కాంగ్రెస్ సర్కార్.. అదే స్కీమ్‌ను మళ్లీ ప్రారంభించబోతున్నది. సర్కార్ బడుల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
- రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించనున్న సర్కార్
- రూ. 500కోట్లు కేటాయించే అవకాశం
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని నిలిపివేసిన కాంగ్రెస్ సర్కార్.. అదే స్కీమ్‌ను మళ్లీ ప్రారంభించబోతున్నది. సర్కార్ బడుల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర బడ్జెట్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రకటించనున్నది. అయితే కొత్త పేరు ఖరారుచేయనున్నట్టు తెలిసింది. ఈ స్కీమ్ కోసం బడ్జెట్లో రూ. 500కోట్లు కేటాయించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో విద్యార్థులకు ఉదయాన్నే మంచి పౌష్టికాహారాన్ని అందించేందుకు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కేసీఆర్ సర్కార్ ప్రారంభించింది. 27,147 పాఠశాలల్లోని 23లక్షల మంది విద్యార్థులకు సమకూర్చే పథకానికి 2023 అక్టోబర్‌లోనే శ్రీకారం చుట్టింది. తొలుత నియోజకవర్గానికి ఒక స్కూల్ చొప్పున 119 స్కూళ్లల్లో పథకాన్ని ప్రారంభించగా, ఆ తర్వాత మండలానికి ఒక స్కూల్ చొప్పున ప్రారంభించారు. క్రమంగా మండలానికి రెండు, మూడు చొప్పున విస్తరించారు. 3,500కు పైగా స్కూళ్లకు అమలు చేశారు. అంతలోనే సర్కార్ మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో బ్రేక్‌ఫాస్ట్ బంద్ అయ్యింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

