Vemulawada | వేములవాడ టౌన్, ఆగస్టు 4: శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం సోమవా రం నుంచి బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయనున్నట్టు ఆలయ ఈఈ రాజేశ్ తెలిపారు. ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో బ్రేక్ దర్శనం ఏర్పాట్లు చేశారు.
ఎంట్రీ టికెట్ ధర రూ.300గా నిర్ణయించారు. రోజులో రెండుసార్లు ఉదయం 10:15 నుంచి 11:15 వరకు, సా యంత్రం 4 నుంచి 5 వరకు దర్శనం ఉం టుంది. ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 10:15 గంటలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బ్రేక్ దర్శనాన్ని ప్రారంభించనున్నారు.