యాదగిరిగుట్ట : యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా బుధవారం స్వామివారు శ్రీ మహావిష్ణు అలంకారంలో గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానార్చకుల ఆధ్వర్యంలో యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, పారాయణీకుల మంతోచ్ఛరణల మధ్య స్వామివారు మాఢవీధుల్లో విహరించారు. 
ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎన్ గీత, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రోజు సాయంత్రం స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం చతుస్థానార్చనలు, మండపారాధనలు, మూలమంత్రజపాలు, ద్వారతోరణ పూజలు, దివ్య ప్రబంధాలు తదితరుల కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ నిర్వహకులు తెలిపారు. 