యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మూడోరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార సేవలను అర్చకులు వైభవంగా ప్రారంభించారు. స్వామివారిని మత్స్యావతర అలంకార సేవపై నయనమనోహరంగా అలంకరించి వేదమంత్రాలు, వేదపారాయణలు మంగళవాయిద్యాల నడుమ బాలాలయంలో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి పాల్గొన్నారు.