శ్రీమహావిష్ణువుగా దర్శనమివ్వనున్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి
Yadadri | యాదాద్రి (Yadadri) శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శ్రీమహావిష్ణు అలంకారంలో దర్శనమివ్వనున్నారు.
యాదాద్రి: యాదాద్రి (Yadadri) శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శ్రీమహావిష్ణు అలంకారంలో దర్శనమివ్వనున్నారు. లక్ష్మీసమేత నారసింహుడు నేడు గురుడ వాహనంపై ఊరేగనున్నాడు. రాత్రి 7 గంటలకు బాలాలయంలో నిర్వహించే రథోత్సవంలో స్వర్ణరథంపై స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి కల్యాణం శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, జీలకర్ర బెల్లం తంతుతో యాదాద్రి క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. బాలాలయంలో వైభవోపేతంగా జరిగిన కల్యాణ వేడుకలను కనులారా వీక్షించి భక్తజనం పులకించింది.
స్వామివారిని శ్రీరామ అలంకారంలో సేవించి హనుమద్వాహనం, గజవాహనంపై ఊరేగించిన అనంతరం తిరుకల్యాణ మహోత్సవ ఘట్టాన్ని ప్రారంభించారు. అభిజిత్ లగ్న సుముహూర్తాన ఉదయం 11 గంటలకు ఆగమశాస్త్రం ప్రకారం రెండు గంటలపాటు వైభవోపేతంగా నిర్వహించారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

