బిజినేపల్లి మార్చ్ 11: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం అడ్డగట్టుపై ప్రకృతి బడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న వేంకటేశ్వర స్వామి (Vattem Venkateswara Swamy Temple) ఆలయంలో బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. మార్చి 15న శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగనుంది.
ఆలయ చరిత్ర
1978-1981 మధ్య కాలంలో గుడ్లనర్వకు చెందిన నర్సింహారావు వట్టెం శివారులోని అడ్డగట్టుపై కుసుమ,హరినాథ్ ఆశ్రమం నిర్మించుకొని కొండపై వెంకన్న ఆలయాన్ని నిర్మించా లని కోరుకున్నాడు.పురాతన విగ్రహాన్ని ఆసరాగా చేసుకొని ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేయాలని సంక ల్పించుకున్నారు. వట్టెం గ్రామస్తులైన సందడి రంగా రెడ్డి 1983లో సివిల్ ఇంజినీర్ గా పనిచేసి ఆనం తరం వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలనే కోరిక ఉండేది.కాగా1983లో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు.1985 నుంచి రంగారెడ్డి శేష జీవితమంతా భగవంతుడి సేవ కోసం అంకితం చేశారు.1986, మేలో వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.అప్పటినుంచి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ పేదల తిరుపతిగా పేరుగాంచింది.1988లో ఆలయ ప్రాంగ ణంలో కల్యాణమండపాన్ని నిర్మించారు. 1994లో నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయాస్కర్రెడ్డి ధ్యానమందిరానికి శంకుస్థాపన చేశారు.అనంతరం వరాహస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు.1999 లో నాగర్ కర్నూలు చెందిన సుబ్బారెడ్డి వాస ఈశ్వరయ్య హకీం మురళి సహకారంతో నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేశారు.అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో ఆంజనేయుడు, గరుడపక్షి విగ్ర హాలు,వసతిగృహాలు, రోడ్లు,రేకులషెడ్ను నిర్మించారు.2021లో రామానుజాచార్యుల విగ్రహాన్ని అనంత నర్సింహారెడ్డి,సుకన్య ఆర్థికసాయంతో ఏర్పాటు చేశారు.మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నిధులతో గోశాల, శ్రీకృష్ణ, గోమాత విగ్రహాలను ఏర్పాటు చేశారు. అలాగే అద్దా లమేడ, ధ్యాన మందిరం, ముఖద్వారం నిర్మించారు. 1999లో 12ఏండ్లకు ఒకసారి పుష్కరో త్సవం నిర్వహించారు. 2011లో ద్వితీయ పుష్కరోత్సవాన్ని నిర్వహించారు. ఏటా సంక్రాం తికి గోదా వెంకన్న కల్యానోత్సవం,శ్రీరామనవమికి రాములోరి కల్యాణం, వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం, పండుగ రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.
17 వరకు బ్రహ్మోత్సవాలు
12న అలం కారం, రాజభోగ నివేదన అర్చన,సేవాకాలం, నివేదన, హోమం, అంకురార్పణ 13న తిరుచి సేవా, సంతానార్తులకి గరుడ ప్రసాద వితరణ, శేష వాహన సేవ 14న ఎదుర్కోళ్ల ఉత్సవం హనుమద్ వాహన సేవ 15న శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం, గరుడ వాహన సేవ 16న కల్ప వృక్షవాహనసేవ17న మహా పూర్ణాహుతి,పల్లకిసేవ ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.