హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 33 జిల్లాల్లో బ్రహ్మణ సంక్షేమ భవనాలకు స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకుంటానని భూపరిపాలన శాఖ కమిషనర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. బ్రాహ్మణ సంఘాల నాయకులు మంగళవారం ఆయనను కలిసి సంక్షేమ భవనాల కోసం స్థలాలు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు దీనిపై గతంలోనే అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రతిపాదనలు వెళ్లాయని చెప్పారు. త్వరలో మరోసారి కలెక్టర్లకు లేఖలు రాసి కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకుంటానని, అన్ని సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.
కార్యక్రమంలో శృంగేరి వేద పండితులు వ్యాసోజుల రాధాకృష్ణశర్మ, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు మరుమాముల వెంకటరమణశర్మ, బోర్పట్ల హనుమంత ఆచార్యులు, అష్టకాల రామ్మోహన్, జోషి గోపాలశర్మ, విద్యావేత్త ఈశ్వరగారి రమణ, సంగారెడ్డి జిల్లా బ్రాహ్మ ణ సంఘం అధ్యక్షుడు రామారావు దేశ్‌పాండే, వేద పండితులు మంచినీళ్ల రామశర్మ, కాసుల రాధాకృష్ణశర్మ, రమేశ్‌రావు కులకర్ణి, బక్షి కిషన్‌రావు, మారేపల్లి చైతన్యశర్మ తదితరులు పాల్గొన్నారు.