హైదరాబాద్, సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : గతంలో ఉ న్న బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ బోర్డు, ధార్మిక పరిషత్ బోర్డులను వెంటనే ఏర్పాటు చేసి, నిధులు విడుదల చేయాలని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి శ్రీధర్‌బాబును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేండ్లుగా బ్రాహ్మణ సంక్షేమ పథకా లు నిలిచిపోవడంతో చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు, విదేశీ విద్యాపథకంలో విదేశాలకు వెళ్లిన వారికి నిధులు మంజూరైనా అందడం లేదని పేర్కొన్నారు. దేవాదాయశాఖ చట్టం ద్వారా 16వేల దేవాలయాల అభివృద్ధికి ధార్మిక పరిషత్ ఏ ర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు. మం త్రిని కలిసిన వారిలో నేతలు డాక్టర్ వింజమూరి సుధాకర్, వెంకటర త్నం, విలాస్శర్మ, రామశర్మరులు ఉన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రజారోగ్య కార్యాలయం(డీహెచ్), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)లో బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు కరెంట్ నిలిపివేశారు. రూ.25లక్షల బకాయిలు చెల్లించకపోవడంతో బుధవారం చర్యలు చేపట్టారు. అయితే ఉదయం ఒక్కసారిగా కరెంట్ పోవడంతో అధికారులంతా షాక్‌కు గురయ్యారు. కరెంట్ బిల్లులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉం డటం, చెల్లింపులో జాప్యం కారణంగా విద్యుత్తు అధికారులు కరెంట్ నిలిపివేసినట్టు తెలిసింది. వైద్యశాఖ అధికారు లు, విద్యుత్ శాఖ అధికారులతో మా ట్లాడటంతో సాయంత్రానికి కరెంట్ సరఫరా పునరుద్ధరించారు.