KTR | హైదరాబాద్ : ఉత్తర, దక్షిణ భారతదేశంలో ఆ నలుగురు నాయకులంటే తనకెంతో అభిమానం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. జైపూర్‌లో జరుగుతున్న టాక్ జర్నలిజం చర్చా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా , ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అంటే నాకు అభిమానం. దక్షిణ భారతదేశం నుంచి శశిధరూర్కి మంచి భవిష్యత్తు ఉంది. అయితే కొన్ని రోజుల నుంచి అతని రాజకీయాలు కొంత గందరగోళంగా ఉన్నాయి. అతను కాషాయికరణ చెందుతున్నాడు అని కేటీఆర్ పేర్కొన్నారు.
దేశానికి ఒక జాతీయభాష ఉండాల్సిన అవసరం లేదు. స్వాతంత్రం వచ్చినప్పటినుండి దేశం అద్భుతంగా పురోగమిస్తుంది. ఇప్పుడు అవసరం లేదు. మందబలం, అధికారం ఉన్నాయన్న అహంకారంతో బలవంతంగా హిందిని రుద్దుతామంటే ఒప్పుకునేది లేదు. ప్రతి 250 కిలోమీటర్లకు మనదేశంలో భాషా, సంస్కృతి ,ఆహారం, వేషభాషలు మారుతాయి. ఈ విషయంలో యూరప్‌కు ఇండియాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. మన మధ్య ఎన్ని వైరుధ్యాలు ఉన్నా మనం ఇంకా కలిసే ఉన్నాము. ప్రజలు మాట్లాడని భాషలు కాలక్రమంలో కనుమరుగు అవుతాయి. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇంగ్లీష్‌ని మాట్లాడుతారు. ఇంగ్లీష్‌తోనే అపార అవకాశాలు దొరుకుతాయి. కేవలం హిందీ నేర్చుకొని అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలకు వెళ్లి మనం ఏం చేయగలం అని కేటీఆర్ ప్రశ్నించారు.