ఉప్పునుంతల, నవంబర్ 1 : డెంగ్యూతో ఐదేండ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. చిన్నారి తల్లిదండ్రుల కథనం మేరకు.. ఉప్పునుంతల మండలం మర్రిపల్లికి చెందిన రెడ్డమోని మల్లేశ్, హైమావతి దంపతుల కుమారుడు శశివర్ధన్ యాదవ్(5)కు వారం కిందట జ్వరం వచ్చింది. చికిత్స నిమిత్తం తల్లిదండ్రు లు అచ్చంపేటలోని కిడ్స్ కేర్ ప్రైవేటు దవాఖానకు తరలించగా.. అక్కడి వైద్యులు పరీక్షించి డెంగ్యూ సోకిందని, హైదరాబాద్కు తీసుకెళ్లాలని సూచించారు.
బాలుడిని హైదరాబాద్కు తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నదని, తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశా రు. వైద్యం అందకపోవడంతో బాలుడు గురువారం రాత్రి మృతి చెందాడు. సకాలంలో వైద్యం అందకే తమ కుమారుడు మృతి చెందినట్టు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు.