గూడూరు, మార్చి 9: గొంతులో పల్లిగింజ ఇరుకొని బాలుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయకపల్లిలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన గుండెల కల్పన-వీరన్న దంపతుల 18 నెలల కుమారుడు అక్షయ్ శుక్రవారం ఇంట్లో పల్లీలు తింటుండగా గొంతులో గింజ ఇరుక్కోవడంతో కుటుంబ సభ్యులు నీరు తాగించారు. ఎకిళ్లతో బాధ పడుతుండగా స్థానిక దవాఖానకు, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లగా వైద్యులు పల్లి గింజను తొలగించారు. ఈ క్రమంలో అక్షయ్‌కు తీవ్ర జ్వరం, ఫిట్స్ రా వడంతో ఆదివారం మృతి చెందాడు.