ఆదిలాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగా ణ): ఆదిలాబా ద్ జిల్లాలో కేం ద్ర ప్రభుత్వం రంగ సంస్థ (సీసీఐ) రైతులకు మద్దతు ధర చెల్లించకపోవడంతో బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బోథ్ మండల కేంద్రంలో శుక్రవారం మూడు జిన్నింగ్‌లో సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించాలని మార్కెటింగ్ శాఖ అధికారులు ఎమ్మెల్యేను ఆహ్వానించగా ఆయన నిరాకరించారు.
అప్పటికే ఎమ్మె ల్యే వద్దకు వచ్చిన రైతులు.. నియోజకవర్గంలో సీసీఐ కేంద్రాల్లో క్వింటాల్‌కు రూ.7,521 మద్దతు ధర చెల్లించడం లేదని తెలిపారు. 12 శాతం తేమ వచ్చి నా సీసీఐ అధికారులు తీసుకోవడం లేదని, చేసేది లేక తాము ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్మి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో ఆయన సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుండా నిరసన చేపట్టారు. మద్దతు ధర ఇవ్వని కేంద్రాలను ఎందు కు ప్రారంభించాలని అధికారులను ప్ర శ్నించారు. కేవలం ఫొటోలకు ఫోజులివ్వడానికైతే తాను కొనుగోలు కేంద్రాల ను ప్రారంభించేది లేదని తేల్చి చెప్పారు.