హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): భారత్‌ను గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసీజ్ కలవరపెడుతున్నదని, దేశంలో పెరుగుతున్న అనారోగ్య సమస్యల్లో ఇదొకటని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆధునిక ఎండోస్కోపీ విధానాలపై యశోద గ్రూప్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు, లైవ్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ..
దేశంలోని ప్రతి 10 మందిలో ఏడుగురు ఉదర సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని, దక్షిణ భారతంలో జీర్ణకోశ వ్యాధుల ప్రభావం పెరుగుతున్నదని తెలిపారు. రెండ్రోజులపాటు జరిగే ఈ సదస్సును య శోద గ్రూప్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ విజ య్ కుమార్, సీనియర్ వైద్యులు రాకేశ్ కుమార్, జీ ఆర్ శ్రీనివాసరావు, విశ్వనాథ్రెడ్డితోపాటు 500 మందికిపైగా వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.