నర్సంపేట (ఖానాపురం), డిసెంబర్ 1: యాసంగి వడ్లకు ప్రభుత్వం వెంటనే బోనస్ చెల్లించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశా రు. సోమవారం వరంగల్ జిల్లా ఖానాపురంలో మీడియాతో మాట్లాడారు. కాం గ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. రైతు పండించిన అన్ని రకాల పంటలకు బోనస్ చెల్లిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి కేవలం సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రైతులకు బోనస్ పైసలు చెల్లించిన తర్వాతే నర్సంపేటలో రేవంత్‌రెడ్డి అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
పత్తి రైతుల కన్నెర్ర

నాగర్‌కర్నూల్ ; పత్తి కొనుగోలు చేయలేదని రైతులు కన్నెర్రజేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మం డలం చిన్నముద్దునూరు కాటన్ మిల్లు ఎదుట ఆందోళన చేపట్టారు. నాలుగు రోజులుగా ఎదురుచూసినా కొనుగోలు చేయలేదంటూ ఆగ్రహం చెందారు.
ధాన్యం కొనడం లేదని రైతుల ఆందోళన

గంగాధర ; ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగరావుపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం కేంద్రం వద్దకు చేరుకొని నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. వడ్లు దాదాపు మూడు లారీల వరకు ఉన్నాయని, కొనకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.