హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల జాతర అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఈ మేరకు ప్రజలకు బుధవారం ఒక ప్రకటనలో పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత గల గోల్కొండలో కొలువైన జగదాంబిక మహంకాళి అమ్మవారికి భక్తులు గురువారం తొలి బోనం సమర్పణతో ఈ జాతర ప్రారంభమవుతుందని చెప్పారు.
తెలంగాణకు ప్రత్యేకమైన ఈ పండుగ తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ పదేండ్ల పాలనలో విశ్వవ్యాప్తమైందని పేర్కొన్నారు. సుమారు 45 రోజులపాటు జరిగే ఈ వేడుకలను కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.