యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ విమాన గోపుర స్వర్ణతాపడం పనులకు భక్తుల నుంచి విరాళాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపు మేరకు పలువురు దాతలు స్పందిస్తున్నారు.
బాంబినో పాస్తా ఫుడ్ ఇండస్ట్రీ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ ఎండీ ఎం సుబ్రమణ్యం రూ. 11,00,000ల చెక్కును ఆలయ ఈవో ఎన్ గీతకు అందజేశారు. ఈ సందర్భంగా ఎం సుబ్రమణ్యంకు ఆలయ పండితులు స్వామి వారి దర్శనం కల్పించి, ఆశీర్వచనాలు అందించారు.