శంషాబాద్ రూరల్, జనవరి 30 : శంషాబాద్ ఎయిర్‌పోర్టును పేల్చివేస్తామని ఫోన్ కాల్ రావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. గురువారం ఎయిర్‌పోర్టును పేల్చివేస్తామని డయల్ 100కు కాల్ వచ్చింది. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, ఎయిర్‌పోర్టు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆధారాలు లేకపోవడంతో ఫేక్‌కాల్‌గా గుర్తించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన నతీన్గా గుర్తించి అరెస్టు చేయగా, మతిస్థిమితంలేని వ్యక్తిగా గుర్తించారు.
డెహ్రాడూన్: గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీత అగర్వాల్‌కు చెందిన రెండు ఐఫోన్లు చోరీకి గురయ్యాయి. ఆమె ఈ నెల 26న మల్సిలోని ఫుట్‌హిల్ గార్డెన్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్న పుడు ఈ సంఘటన జరిగింది. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మూల్‌చంద్ త్యాగి డెహ్రాడూన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు వెతికి నప్పటికీ అవి దొరకలేదని చెప్పారు. ఆ రెండు ఫోన్ల వివరాలను ఫిర్యాదులో తెలిపారు.