Manipur | న్యూఢిల్లీ, జూన్ 24 (నమస్తే తెలంగాణ): మణిపూర్‌లో జాతుల ఘర్షణ తీవ్రరూపం దా ల్చి అంతర్యుద్ధానికి దారితీస్తున్నా ప్రధాని మోదీ మౌనం వహించటం ఆందోళన కలిగిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ అన్నారు. అక్క డి ప్రజలకు దేశం తరఫున భరోసా ఇవ్వాలంటే మోదీ స్పందించాలని డి మాండ్ చేశారు. మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ తరఫున వినోద్ హాజరయ్యారు. కేంద్రానికి పలు సూచనలు చేసినట్టు సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా కులా లు, మతాలు, జాతుల మధ్య ఘర్షణలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మెజారిటీ వర్గమైన మైటీలు తమను ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారని, ఎవరినైనా ఎస్టీల్లో చేర్చే అధికారం ఒక్క పార్లమెంట్‌కు మా త్రమే ఉంటుందని చెప్పారు. ‘అల్లర్ల సమయంలో పోలీసుల నుంచి మైటీ సా యుధులు 4 వేల ఆయుధాలు అపహరించా రు. అల్లర్లను నియంత్రించేందుకు కేంద్ర బలగాలు మోహరించామని చెప్తున్నారు. సాయుధు లు ఎత్తుకెళ్లిన ఆయుధాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించాం.
ఘర్షణల కారణం గా వేలమంది నిరాశ్రయులయ్యారు. వెంటనే వారికి కేంద్రం పునరావాసం కల్పించాలని కోరాం. 50 రోజులుగా ఇంటర్నెట్ను నిలిపేయటం వల్ల విద్యార్థులు, ఇతర సేవలకు అంతరా యం కలుగుతున్నది. అందువల్ల వెంటనే ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని కోరాం. మా సూచనలు స్వీకరిస్తామని అమిత్ షా తెలిపారు. ఏదేమైనా మణిపూర్ ప్రజలకు భరోసా, ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత దేశంలోని అన్ని రాజకీయ పార్టీలపై ఉన్నదని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించాం’ అని వినోద్ వివరించారు.