కాంగ్రెస్ పాలనలో గడ్డు పరిస్థితులు.. హైదరాబాద్‌కు తాగునీటి తిప్పలు
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ఎంపీ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి బోయినపల్లి వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు.
- నగరాన్ని వీడనున్న 30 లక్షల ప్రజలు
- తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష
- పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
- మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్
హనుమకొండ, అక్టోబర్ 25 : కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ఎంపీ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి బోయినపల్లి వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం హనుమకొండలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి అధ్యక్షతన జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పట్టభద్రుల ఓటరు నమోదు సన్నాహక సమావేశానికి వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అసమర్థ పాలనతో తాగు, సాగునీరు, విద్యుత్తు సమస్యలు వస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్‌పై అసత్య ప్రచారాలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఆ పార్టీ మాటలు నమ్మి మోసపోయామని గుర్తిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పట్టభద్రులు, మేధావులు, ఉద్యోగులు, విద్యావంతులు లోతుగా ఆలోచిస్తున్నారని, అందుకే ఈ ఎన్నికలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయని పేర్కొన్నారు. ‘రానున్న రోజుల్లో హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తప్పవని, కొన్ని నెలల్లో హైదరాబాద్ నుంచి 30 లక్షల మంది వరకు సొంతగ్రామాలకు తరలి వెళ్తారని, ఇది జరుగకపోతే తన పేరు మార్చుకుంటానని’ ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని, రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి ఓటరు నమోదే కీలకమని స్పష్టం చేశారు. ఎన్నికల బ్యాలెట్ పై రాజకీయ పార్టీల గుర్తులు లేకపోయినా.. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

