హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సిక్కిం రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. నాలుగు రోజుల వ్యక్తిగత పర్యటనకు వెళ్లిన ఆయన.. మంగళవారం సికిం రాష్ట్ర క్యాబినెట్ సెక్రటరీ విజయ్భూషణ్ పాఠక్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, సిక్కిం రాష్ర్టాల అభివృద్ధి, వ్యవసాయం, జీఎస్డీపీ, జీడీపీ, పరిశుభ్రతపై చర్చించినట్టు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సాగిన 14 ఏండ్ల రాష్ట్ర సాధన ఉద్యమం, సీఎంగా కేసీఆర్ పదేండ్లలో చేసిన అభివృద్ధి, వ్యవసాయ ప్రగతి, గోదావరి, కృష్ణా నదులపై నిర్మించిన ప్రాజెక్టులు, పెరిగిన పంటల ఉత్పత్తి గురించి పాఠక్‌కు వివరించినట్టు పేర్కొన్నారు. సిక్కింలో పసుపు, అల్లం, యాలకులు, గోధుమలు, పండ్ల తోటలు సేంద్రియ పద్ధతిలోనే సాగుచేస్తామని పాఠక్ తెలిపినట్టు వెల్లడించారు.