Hanamkonda | నయీంనగర్, జూన్ 10: హనుమకొండలో చెరువులో వింత ఘటన చోటుచేసుకున్నది. ఓ వ్యక్తి గంటలకొద్దీ నీటిలో తేలాయాడుతూ ఉండటంతో చనిపోయాడుకొని స్థానికులు పోలీసులు, 108కు ఫిర్యా దు చేశారు. వారి వచ్చి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా లేచి నడిచిరావడంతో అంతా అవాక్కయ్యారు. కేయూసీ పోలీస్స్టేషన్ పరిధి రెడ్డిపురంలోని కోవెలకుంటలో దాదాపు 46 ఏండ్ల వ్యక్తి సోమవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నీటిలో తేలియాడుతూ ఉండటంతో స్థానికులు అతడు మరణించి ఉంటాడని భావించారు.
వెంటనే కేయూ సీ పోలీసులకు, 108కు సమాచారం అందించారు. అకడికి చేరుకున్న పోలీ సులు బయటకు తీసే క్రమంలో అతడు లేచే సరికి అవాకయ్యారు. ‘ఇకడ చల్లగా ఉన్నదని నేను రెస్ట్ తీసుకుంటున్నా.. నేను చావలేదు.. బతికే ఉన్నా’ అంటూ సమాధానమిచ్చాడు. తన పేరు శ్రీనివాస్ అని, తన స్వగ్రామం ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి అని చెప్పాడు. తాను కాజీపేట దగ్గరలోని ఓ గ్రానైట్ కంపెనీలో పది రోజులుగా వేడి వాతావరణంలో పని చేస్తున్నానని పేర్కొన్నాడు. ఉదయం 7 నుంచి రా త్రి 7 గంటల వరకు పని చేస్తుంటానని, అందుకే చెరువులో పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలిపాడు. రూ.50 ఉంటే కాజీపేటకు పోతానంటూ బతిమాలుకున్నాడు.