BLO Remuneration |హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న బూత్ లెవల్ ఆఫీసర్ల(బీఎల్వోలు)కు రూ.6 వేల గౌరవ వేతనం చెల్లించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించే బీఎల్వోలకు ప్రతి ఏడాదికీ రూ.6వేల గౌరవ వేతనం చెల్లించేవారు.
అయితే, ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఆ గౌరవ వేతనాన్ని రూ.12వేలు(డబుల్)చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన ‘సర్’ ప్రక్రియలో పాల్గొంటున్నందుకు అదనంగా రూ.6వేల గౌరవ వేతనం చెల్లించనున్నట్టు సీఈవో కార్యాలయవర్గాలు వెల్లడించాయి.