మంచిర్యాల : తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్(టీఎన్జీవో) అసోసియేషన్‌కు చెందిన మంచిర్యాల జిల్లా చాపర్ట్ తలసేమియా రోగుల సహాయార్థం శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్యామలా దేవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన టీఎన్జీవో సిబ్బందిని శ్యామల అభినందించారు. ఈ క్యాంప్ ద్వారా 80 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా చైర్మన్ కె.భాస్కర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు జి. శ్రీహరి, సెక్రటరీ భూముల రామ్మోహన్, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీపథ్బాబు రావు, జాయింట్ సెక్రటరీ శ్రీధర్, హన్మంత్‌రెడ్డి, సునీత, ట్రెజరర్ సత్యనారాయణ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పొన్న మల్లయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రవణ్, మంచిర్యాల యూనిట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, సెక్రటరీ ప్రభు లింగం, తదితరులు పాల్గొన్నారు.