హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగం గన్నీ బ్యాగుల (గోనె సంచుల) ట్రాకింగ్ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగిస్తున్నది. ఇందుకోసం స్టాట్విగ్ కంపెనీతో జతకట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో బియ్యం సరఫరాలో వినియోగించే గన్నీ బ్యాగులను ట్రాక్ చేసేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీని పైలట్ ప్రాజెక్టుగా సిద్దిపేట, జనగామ జిల్లాల్లో ప్రారంభించారు. గన్నీ బ్యాగులపై ఆర్ఎఫ్ఐడీ, క్యూఆర్ కోడ్లతో కూడిన స్టిక్కర్‌ను అంటించి, అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించేందుకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా అవకాశం
కలుగుతుందని ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ అధికారులు తెలిపారు.