హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ప్రముఖ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ సేవల సంస్థ బ్లాక్‌బెర్రీ తమ ఐవోటీ ఇంజినీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాన్ని స్థాపించేందుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. బ్లాక్‌బెర్రీ నిర్ణయానికి సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తను గురువారం ఆయన ట్వీట్ చేశారు.
ఒకప్పుడు మొబైల్ ఫోన్లకు సుపరిచితంగా ఉన్న బ్లాక్‌బెర్రీ తన గ్లోబల్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌కు విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. బ్లాక్‌బెర్రీకి సంబంధించి కెనడా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఐఓటీ డివిజన్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుండడం విశేషం.